పెరుతున్న సౌదీ అరేబియా టూరిస్ట్ యాత్రికులు, భారతీయులే ఎక్కువ మంది

 సౌదీ అరేబియా టూరిస్ట్ వీసా లు మొదలుపెట్టిన తరువాత ఇండియా నుండి చాలా మంది యాత్రికులు సౌదీ అరేబియా వెళ్ళే దానికి ఆసక్తి చూపిస్తున్నారు.


ఒకప్పుడు సంవత్సరపు టూరిస్ట్ వీసా 70000rs ఉండేది..కానీ కాలక్రమేణా ఇప్పుడు ఉన్న పరిస్థితి లో 25 నుండి 30 వేల రూపాయలకే మాత్రమే లభించింది.

టూరిస్ట్ వీసా కోసం ట్రావెల్స్ ఏజెన్సీ వారిని సంప్రదించవలసి ఉంటుంది.15 రోజుల్లో 1 సంవత్సరపు బహుళ ప్రవేళ వీసా చాలా సులభంగా దొరుకుతుంది.

Al Ula 


కావలసిన పత్రాలు పాస్పోర్ట్ ,4 ఫోటోలు, ఆధార్, పాన్ కార్డ్,6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్


కానీ ఇక్కడ కొంతమంది అవగాహన లేని కారణంగా టూరిస్ట్ వీసా ద్వారా వెళ్లి వర్క్ వీసా మార్చుకుందాం అనే ఉదేశ్యం తో సౌదీ అరేబియా కీ వెళ్లి అవస్థలు పడుతున్నారు

టూరిస్ట్ వీసా ద్వారా మనం ఉమ్రహ్ చేయవచ్చు మరియు సౌదీ అరేబియా ఎక్కడికి అయిన ట్రావెల్ చేయవచ్చు కానీ పనీ చేసే దానికి ఈ వీసా వర్తించదు..

            కాబట్టి టూరిస్ట్ వీసా విజిట్ చేసే దానికి మాత్రమే ఉపయోగించుకోండి..

Makkah street 
ఒకవేళ ఎవరైనా టూరిస్ట్ వీసా పైన సౌదీ అరేబియా కీ వెళ్లి వర్క్ చేస్తూ పోలీస్ వాళ్లకు దొరికితే లైఫ్ టైం ట్రావెల్ బ్యాన్ ఉంటుందని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నా.. ఇది వరకే ట్రావెల్ బ్యాన్ ఉన్నవారు మరియు ఎక్సిట్ రీఎంట్రీ మీద ఈమధ్య కాలంలో వచ్చిన వాళ్ళు టూరిస్ట్ వీసా తీసుకోకపోవడం మంచిది

Comments