14 ఏళ్ల తరువాత తెలంగాణ వ్యక్తి కీ దుబాయ్ జైలు నుండి విముక్తి..
హైదరాబాద్ : తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వలస కార్మికుడు హత్య కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవించి దాదాపు 14 సంవత్సరాల తరువాత దుబాయ్ నుంచి విడుదల అయ్యాడు. మెండోరా గ్రామానికి చెందిన మకూరి శంకర్ జైలు శిక్ష పూర్తి చేసుకొని గడిచిన శుక్రవారం వారం స్వగ్రామానీకి చేరుకున్నాడు 2006 లో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి ఒక కంపెనీ లో మూడేళ్ళ పాటు ఫోర్ మెన్ గా పనిచేశాడు అయితే 2009 లో అతను స్వదేశానికి తిరిగి రావలసిన సమయం లో అనుకోని సంఘటనలు జరిగింది. శంకర్ సహోద్యోగి ప్రమాదవశాత్తు నిర్మాణo లో ఉన్న భవనం లోని ఆరో అంతస్థు నుండి క్రిందపడి మృతి చెందాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన దుబాయ్ పోలీస్ వారు ఆ వ్యక్తి మృతి కీ శంకర్ కారణమని నిర్దారించి అతన్ని అరెస్ట్ చేశారు. 2013 లో దుబాయ్ కోర్ట్ లో నేను అతన్ని చంపలేదని ప్రమాదవశాత్తు మరణించాడని శంకర్ గట్టిగా వాదించాడు,తన శిక్ష ను పునఃపరిశీలించాలని అప్పీల్ చేసాడు. తరువాత దుబాయ్ కోర్ట్ వారు క్షమాభిక్ష పత్రాన్ని తీసుక...